రైల్వేశాఖ కీలక నిర్ణయం.. పండుగలకు 392 ప్రత్యేక రైళ్లు !

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. పండుగలకు 392 ప్రత్యేక రైళ్లు !
x
Highlights

ప్రయాణికల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్‌ దృష్టిలో పెట్టుకుని 392 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 20...

ప్రయాణికల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్‌ దృష్టిలో పెట్టుకుని 392 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. ఇందులో భాగంగా 42 ప్రత్యేక రైళ్ళను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే రద్దీ అధికంగా ఉండే రూట్లకి వీటిని కేటాయించింది.

దేశంలో దసరా సీజన్‌ మొదలైంది. పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. ఇప్పటికే విడతల వారీగా 350 ప్రత్యేక రైళ్ళను నడుపుతున్న రైల్వే డిపార్ట్‌మెంట్‌ వరుస పండగలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా 392 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఈ రైళ్ళు ఈనెల 20 నుండి నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలగు రాష్ట్రాల గుండా తిరుమల, నారాయణాద్రి, గౌతమి, నర్సాపూర్, చార్మినార్, శబరి, బెంగళూరు, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు ప్రతీరోజూ నడుస్తాయి. వారంలో ఐదు రోజులు విశాఖపట్నం – విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్ నడవనుంది. వారానికి మూడు రోజులు రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్, వారానికి రెండు రోజులు జైపూర్‌ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-అమరావతి రైళ్లు నడవనున్నాయి. ఇక గౌహతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌-తిరుపతి, విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు నడపనుంది రైల్వే శాఖ.

కాచిగూడ–మైసూరు మధ్య ప్రత్యేక రైలును ఈనెల 20 నుంచి నవంబర్‌ 29 వరకు డెయిలీ నడపున్నారు. హైదరాబాద్-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 25 మధ్య సోమ, బుధవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక జైపూర్ నుంచి హైదరాబాద్‌ ట్రైన్‌ ఈ నెల 23 నుంచి నవంబర్‌ 27 వరకు బుధ, శుక్రవారాల్లో నడవనుంది. ఈ నెల 22 నుంచి నవంబర్‌ 26 వరకు ప్రతి గురువారం హైదరాబాద్‌–రాక్సౌల్ ట్రైన్‌ అక్టోబర్ 21 నుంచి నవంబర్‌ 25 వరకు ప్రతి బుధవారం బరౌనీ–ఎర్నాకుళం రైల్‌ నడుస్తుంది.

ఇక ఎర్నాకుళం–బరౌనీ రైలు ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ఆదివారాల్లో నడపనున్నారు. విశాఖపట్నం, హజ్రత్‌ నిజాముద్దీన్ రైలు ఈ నెల 23 నుంచి శుక్ర, సోమవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఇక నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం ట్రైన్‌ ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లకి ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా బస్సుల పునరుద్దరణ కానందున ఈ ప్రత్యేక రైళ్ళకు డిమాండ్ ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories