Independence Day: నింగిలో తిరంగా రెపరెపలు

Indian flag unfurled 30 kilometers above the planet by Space Kidz India
x

Independence Day: నింగిలో తిరంగా రెపరెపలు

Highlights

Independence Day: అంతరిక్షానికి 30 కి.మీ. దూరంలో త్రివర్ణ పతాకం

Independence Day: దేశ వ్యాప్తంగా 75వ స్వతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ దాకా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భూమిపైన, అంతరిక్షానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ తిరంగా జెండా రెపరెపలాడింది. నింగిలో ఎగురుతున్న జెండా.. అందులో కదులుతున్న భూమి చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎంతో శోభాయమానంగా జెండా రెపరెపలాడింది. ఈ జెండాను స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా-ఎస్‌కేఐ బెలూన్ ద్వారా అంతరిక్షం అంచునకు పంపింది. అజాదీగా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగానే ఈ జెండాను నింగిలోకి పంపి.. స్వతంత్ర వేడుకలను జరుపుకుంటున్నట్టు యువ శాస్త్రవేత్తల బృందం స్పేస్‌ కిడ్జ్‌ తెలిపింది.

ఇదిలా ఉండగా.. భారత సంతతికి చెందిన అమెరికన‌ వ్యోమగామి రాజాచారి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్‌ఎస్‌లో తిరంగా జెండాతో ఉన్న ఫొటోను పంచుకున్నారు. భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంతరిక్షం నుంచి తన తండ్రి పుట్టిన హైదరాబాద్‌ ఎంతో ప్రకాశవంతంగా కనిపించిందని తెలిపారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం నిర్వహించే వేడుకల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. నాసా ఆధ్వర్యంలో భారత్‌తో కలిసి పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నట్టు రాజాచారి వెల్లడించారు. దేశంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలు గడిపిన రాజాచారి ఈ ఏడాది ప్రారంభంలో తిరిగొచ్చారు. స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో మెక్సికో తీరంలో ల్యాండ్‌ అయిన నలుగురిలో రాజాచారి కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories