Russia-Ukraine Crisis: భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ వదిలి వెళ్లండి

Indian Embassy in Ukraine Asked Indian Students to Leave
x

Russia-Ukraine Crisis: భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ వదిలి వెళ్లండి

Highlights

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం అలముకోవడంతో అక్కడుండే భారతీయ విద్యార్థులను దేశం విడిచి వెళ్లాలని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం సూచిస్తోంది.

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం అలముకోవడంతో అక్కడుండే భారతీయ విద్యార్థులను దేశం విడిచి వెళ్లాలని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం సూచిస్తోంది. ఉక్రెయిన్ యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల కోసం తమను ఎంక్వైరీ చేస్తున్నారని, అయితే ఆన్ లైన్ క్లాసుల కోసం ఎదురు చూడరాదని ఇండియన్ ఎంబసీ అధికారులు చెబుతున్నారు.

మెడికల్ యూనివర్సిటీలతో తాము సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు వారు చెబుతున్నారు. భారతీయ విద్యార్థులు వీలైనంత తొందరగా దేశం విడిచి వెళ్లాలని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మార్చి 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరిద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉక్రెయిన్లో భారత్ శాంతిపూర్వక వాతావరణం కోరుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..రష్యా అధినేత పుటిన్ తో మాట్లాడుతారని, త్వరలోనే శాంతి నెలకొంటుందని తాము ఆశిస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories