లడఖ్‌లో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న చైనా.. మెరుగైన స్థితిలో భారత్..

లడఖ్‌లో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న చైనా.. మెరుగైన స్థితిలో భారత్..
x
Highlights

లడఖ్‌లోని పంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని భారత సైనికులను ఓడించిన తరువాత..

లడఖ్‌లోని పంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని భారత సైనికులను ఓడించిన తరువాత.. ఇప్పుడు ఉత్తర ప్రాంతాలలో చైనా తన దళాలను క్రమంగా పెంచుతోంది. ఇక్కడ కొత్త నిర్మాణం కూడా జరుగుతోంది.. ఇక్కడ నూతన రవాణా మార్గాలను కూడా చైనా సైనికులు అన్వేషిస్తున్నారు, అయితే భారత సైనికులు ఈ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్నందున ఈ చర్యలపై నిఘా ఉంచారు. ఈ ఉత్తర తీరంలోని ఫింగర్‌ 4 వద్ద చైనా దళాల కన్నా భారతే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ, కీలక పర్వత ప్రాంతాలు భారత్‌ స్వాధీనంలో ఉన్నాయి. రెండు దేశాల సైనికులు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్నారు. ఇదిలావుండగా, బుధవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో భారత, చైనా దళాల మధ్య 4 గంటలపాటు చర్చలు జరిగాయి. కానీ చైనా సైనికులు మాత్రం పంతానికిపోతున్నారు.

ఈ క్రమంలో జూన్ 15న గాల్వన్లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఓ కొత్త వీడియో వచ్చింది. ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ విడుదల చేసింది. 3 నిమిషాల 25 సెకన్ల ఈ వీడియోలో, భారత్ చైనా సైనికులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడం కనిపిస్తుంది. వాగ్వివాదం సమయంలో కొంతమంది సైనికులు నీటిలో పడిపోయారు. గాల్వన్‌లో జరిగిన ఘటనలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మంది చైనా సైనికులు మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అప్పటి నుండి రెండు వైపులా చర్చలు జరుగుతున్నా.. ఇంతవరకు పరిష్కారం కనుగొనబడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories