Pandora Papers Leak: పండోరా ప్రకంపనలు, లిస్ట్‌లో 300కు పైగా భారతీయులు

Indian Celebrities and Business Men are in List of Pandora Papers Released by ICIJ | Sachin Tendulkar Pandora Paper
x

Pandora Papers Leak: పండోరా ప్రకంపనలు, లిస్ట్‌లో 300కు పైగా భారతీయులు

Highlights

Pandora Papers Leak: *పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు *లిస్ట్‌లో 300కు పైగా భారతీయులు

Pandora Papers Leak: ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదార్ల గట్టురట్టయ్యింది. వివిధ దేశాల్లోకి సంపదను మళ్లించిన దేశాధినేతలు, వాణిజ్య వేత్తలు, వివిధ రంగాల సెలబ్రిటీల పేర్లు పండోరా పేపర్స్‌లో బహిర్గతమయ్యాయి. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన 'పనామా పేపర్స్‌' తరహాలోనే.. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌.. ఈ పండోరా పేపర్స్‌ను విడుదల చేసింది. విస్తుపోయే వాస్తవాల్ని బయటపెట్టింది. పన్నుల బెడద లేని దేశాల్లో నల్లధనాన్ని దాచుకునేందుకు పలు కంపెనీలు, ట్రస్ట్‌లను సృష్టించి, వాటి ద్వారా స్వదేశాల నుంచి డబ్బును మళ్లించారు.

ప్రపంచవ్యాప్తంగా పండోరా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ లిస్టులో దాదాపు 3 వందల మందికి పైగా భారతీయులు ఉండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అనిల్‌ అంబానీ, కిరణ్‌ మజుందార్‌ షా భర్త జాన్‌, సచిన్‌ టెండుల్కర్‌ పేర్లు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా.. నీరా రాడియా, వినోద్‌ అదానీ, జాకీ ష్రాఫ్‌, కెప్టెన్‌ సతీశ్‌ శర్మ, వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. భారత్‌కు చెందిన ఏడుగురు పొలిటీషియన్స్‌ పేర్లు కూడా జాబితాలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

పండోరా పత్రాల్లో వెల్లడైన సమాచారంపై కేంద్ర ఆర్థికశాఖ దర్యాప్తు చేస్తోంది. సీబీడీటీ, ఈడీ, ఆర్‌బీఐ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సిబ్బందితో కూడిన బృందం ఈ బాధ్యతను చేపడుతున్నట్టు వెల్లడించింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. దర్యాప్తు సమర్థంగా సాగేందుకు అన్నివిధాలా వివరాలను తెప్పిస్తామని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories