Indian Apps Popularity: స్వదీశీ యాప్ లపై పెరుగుతున్న క్రేజ్.. చైనాకు చెక్ చెబుతున్న ఇండియా ప్రజలు

Indian Apps Popularity: స్వదీశీ యాప్ లపై పెరుగుతున్న క్రేజ్.. చైనాకు చెక్ చెబుతున్న ఇండియా ప్రజలు
x
Indian Apps
Highlights

Indian Apps Popularity: ఎప్పుడైతే చైనా యుద్ధానికి దిగిందో అక్కడ నుంచి ప్రతి భారతీయుడు దానికి సంబంధించిన వస్తులను నిషేదించాలనే దానిపై ఎలుగెత్తి చాటుతున్నాడు.

Indian Apps Popularity: ఎప్పుడైతే చైనా యుద్ధానికి దిగిందో అక్కడ నుంచి ప్రతి భారతీయుడు దానికి సంబంధించిన వస్తులను నిషేదించాలనే దానిపై ఎలుగెత్తి చాటుతున్నాడు. ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన కొన్ని ఒప్పందాలు తన పరిధిలో ఉంటే వెంటనే కాన్సిల్ చేసేటంత కోపంతో ఉన్నాడు. అయితే దీని కసి చైనా యాప్ లపై పెట్టి తీర్చుకుంటున్నాడు. దీనివల్ల చైనా యాప్ ల స్థానంలో స్వదేశీ యాప్ ల వినియోగం పెరిగింది. అధికశాతంలో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

మొబైల్‌ ఫోన్‌ యూజర్లలో దేశభక్తి ఉప్పొంగుతోంది. స్వదేశీ యాప్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. గల్వాన్‌లో భారత సైన్యంపై చైనా దాడి అనంతరం దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. యువతను, పెద్దలను ఉర్రూతలూగించిన చైనా యాప్‌ టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధించడంతో ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్‌లను గుర్తించి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది.

అంతా మేడిన్‌ ఇండియా..

► టిక్‌టాక్, ఉయ్‌ చాట్, హెల్లో వంటి చైనా మొబైల్‌ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

► స్వదేశీ యాప్‌లకు మేడిన్‌ ఇండియా అనే ట్యాగ్‌లైన్‌ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది.

► 'చింగారి మేడిన్‌ ఇండియా' యాప్‌లో వీడియో, ఆడియో, షేరింగ్‌ వంటి ఆప్షన్లు ఉండటంతో ప్రజాదరణ పొందుతోంది.

► బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్‌ సిద్ధార్థ్‌ గౌతమ్‌ అనే ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ యాప్‌ను అభివృద్ధి చేశారు.

► టిక్‌టాక్‌ ఉన్న రోజుల్లో పాత చింగారి యాప్‌నకు పెద్దగా ఆదరణ లభించలేదు.

► వీడియో బ్లర్‌ అవుతోందని, సరిగా షేర్‌ కావడం లేదనే సాంకేతిక సమస్యలను యూజర్లు ఏకరువు పెట్టేవారు.

► ఇప్పుడు సాంకేతిక సమస్యలు అధిగమించడంతో చింగారి యాప్‌నకు క్రేజ్‌ పెరిగింది.

► వీడియో, ఆడియో, ఫొటో వంటి వాటితో షేరింగ్‌ ఆప్షన్లు గల స్వదేశీ యాప్‌లు ఇప్పుడు మన దేశంలో సత్తా చాటుతున్నాయి.

► చింగారి, ట్రెల్, మోజ్‌ వంటి స్వదేశీ యాప్‌లు కోటికి పైగా డౌన్‌ లోడ్స్‌ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి.

► ఇదే తరహాలో 'జోష్‌' యాప్‌ 50 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తుండటం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories