Samudrayaan: మరో ప్రయోగం... సముద్రయాన్‌కు సిద్ధమవుతున్న భారత్

India is Getting Ready Samudrayaan
x

Samudrayaan: మరో ప్రయోగం... సముద్రయాన్‌కు సిద్ధమవుతున్న భారత్

Highlights

Samudrayaan: సముద్రయాన్‌కు సిద్ధమవుతున్న భారత్

Samudrayaan: చంద్రయాన్ -3 విజయంతో ఊపుమీదున్న భారత్ త్వరలో సముద్రయాన్ కు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య-6000 ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సబ్ మెరైన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని తెలిపారు. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని వెల్లడించారు.

ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చనని తెలిపారు. దాంతో సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతోందన్నారు. తొలుత ఇది 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని రిజిజు తెలిపారు. బ్లూ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా భారత్ ఈ డీప్ ఓషన్ మిషన్ ను చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories