Iran Supreme Leader Khamenei: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారన్న ఖమేనీ... తీవ్రంగా స్పందించిన భారత్

India Hits Back Iran Supreme Leader Khamenei Suffering of Muslims Remark
x

Iran Supreme Leader Khamenei: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారన్న ఖమేనీ... తీవ్రంగా స్పందించిన భారత్

Highlights

ప్రపంచంలో ముస్లిం మతస్థులు బాధలు అనుభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా చేర్చారు ఇరాన సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుసేనీ ఖమేనీ.

ప్రపంచంలో ముస్లిం మతస్థులు బాధలు అనుభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను కూడా చేర్చారు ఇరాన సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుసేనీ ఖమేనీ.

ఆయన వ్యాఖ్యలను ‘తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యలపై భారత్ వెంటనే స్పందించింది. సరైన సమాచారం లేకుండా ఖమేనీ ఆ వ్యాఖ్యలు చేశారని, అవి తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ ప్రకటించింది.

ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఖమేనీ, “ఇస్లామిక్ సహోదరులుగా మన సామూహిక గుర్తింపును దెబ్బతీసేందుకు ఇస్లాం శత్రువులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మియాన్మర్, గాజా, భారత్ లేదా మరేదైనా చోట ముస్లింలు బాధలు పడుతుంటే పట్టించుకోకుండా ఉంటే మనం ముస్లింలే కాదు” అని అన్నారు.

ఈ ట్వీట్ బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. “ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలపై ప్రకటన” అనే శీర్షికతో భారత్ తన ప్రకటన విడుదల చేసింది. “భారతదేశంలోని మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవి తప్పుడు సమాచారంతో చేసిన వ్యాఖ్యలు. అవి ఏమాత్రం ఆమోదయోగ్యం కావు” అని భారత్ స్పష్టంగా ప్రకటించింది.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ఖమేనీ వ్యాఖ్యలు వెలుగు చూశాయి. ఈ రెండు దేశాల మధ్య వైరం భారత ప్రభుత్వాన్ని అసౌకర్యానికి గురి చేస్తోంది.

నిజానికి, భారత్ ఈ రెండు దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. భారత్‌కు కావలసిన చమురులో 80 శాతం పశ్చిమ ఆసియా నుంచే వస్తోంది. ఇక, ఇజ్రాయెల్‌తో రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలలో భారత్ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది.

పశ్చిమ ఆసియాలో ఇరాన్ నుంచి భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి ఎదురవుతున్న తీవ్రవాద ముప్పు విషయంలోనూ భారత్, ఇరాన్ దేశాలు రెండూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి, ఇజ్రాయెల్‌తో భారత్ అనుబంధానికి కూడా తీవ్రవాద సమస్య ఒక ప్రధాన కారణం.

ముంబయిపై 2008 నవంబర్ 26న జరిగిన తీవ్రవాద దాడులు భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఆ హింసాకాండలో 175 మంది చనిపోయారు. 26/11 రోజే ఇజ్రాయెల్‌లో జరిగిన తీవ్రవాదుల దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది యూదులు చనిపోయారు. అందుకే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ మెరుపుదాడి చేసినప్పుడు భారత్ ఆ దేశానికి మద్దతుగా నిలబడింది.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. రెండు వైపులా చాలా మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు ఇరాన్ ఉన్నట్లుండి భారతదేశాన్ని గాజా, మియాన్మర్ దేశాల వరసలో చేర్చుతూ మాట్లాడడం వెనుక మారుతున్న యుద్ధ వాతావరణమే కారణంగా కనిపిస్తోంది. ఏమైనా, భారత్ ఈ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories