దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

దేశంలో 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
x
Highlights

కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా 13 కోట్లకు పైగా పరీక్షలతో భారత్ మరో మైలురాయిని దాటిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా 13 కోట్లకు పైగా పరీక్షలతో భారత్ మరో మైలురాయిని దాటిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 10,66,022 నమూనాలను ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 13 కోట్ల 6 లక్షల 57 వేలు దాటిందని పేర్కొంది. చివరి కోటి పరీక్షలు కేవలం పది రోజుల్లోనే చేసినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా నిత్యం రోజుకు పది లక్షలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ICMR తెలిపింది.

ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,232 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 90,50,597కి చేరుకుంది. అయితే ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉండగా, ఇప్పటివరకు వైరస్ నుంచి 84,78,124(93.67శాతం) మంది కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో 564మంది మరణించగా, మరణాల సంఖ్య 1,32,726 సంఖ్యకు చేరుకుంది. ఇక నిన్న 10,66,022 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories