Price Hike: సామాన్యుడికి షాక్..టీ, బిస్కెట్, సబ్బు, నూనె ధరలు భారీగా పెరిగే చాన్స్.. జేబు మోత మోగిపోవడం ఖాయం

Price Hike: సామాన్యుడికి షాక్..టీ, బిస్కెట్, సబ్బు, నూనె ధరలు భారీగా పెరిగే చాన్స్.. జేబు మోత మోగిపోవడం ఖాయం
x
Highlights

Price Hike: దేశంలో నిత్యావసరాల ధరలు రోజు రోజూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోసారి దేశంలో నిత్యావసర ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పేదల...

Price Hike: దేశంలో నిత్యావసరాల ధరలు రోజు రోజూ పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోసారి దేశంలో నిత్యావసర ధరలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పేదల నుంచి మధ్య తరగతి వరకు అందరిపై భారీగా భారం పడనుంది.

హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్, మారికో, ఐటీసీ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) కంపెనీలు కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ధరలు పెంచేందుకు షాక్ ఇవ్వబోతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా, సబ్బులు, వంట నూనెలు, టూత్‌పేస్ట్ వంటి రోజువారీ వస్తువులను తయారు చేసే FMCG కంపెనీల ఆదాయ మార్జిన్‌లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దీని ప్రభావం కంపెనీల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై కూడా కనిపిస్తోంది.

సాధారణంగా రోజువారీ అవసరాలకు ఉపయోగించే వస్తువులు, పదార్థాలను తయారు చేసే సంస్థలను FMCG (ఫాస్ట్ మూవింగ్ కన్ జ్యూమింగ్ గూడ్స్) కంపెనీలు అని పిలుస్తుంటారు. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడి పదార్థాల ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరిగాయి. ఈ కారణంగా, కంపెనీల తయారీ వ్యయం పెరిగింది, దీనిని భర్తీ చేయడానికి పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలను పెంచే ఆలోచనలో ఉన్నాయి.

హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్), గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జిసిపిఎల్), మారికో, ఐటిసి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (టిసిపిఎల్) ఉత్పతులకు పట్టణాల్లో వినియోగం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఎఫ్‌ఎంసిజి రంగం మొత్తం విక్రయాల్లో పట్టణ వినియోగం వాటా 65-68 శాతం ఉంటుంది. అయితే అనూహ్యంగా నగరాల్లో కంటే గ్రామాల్లోనే వినియోగం ఎక్కువగా జరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇది స్వల్పకాలిక ఎదురుదెబ్బగా మాత్రమే భావిస్తున్నామని, ఉత్పత్తుల ధరల పెంపు ద్వారా తిరిగి ఆదాయ మార్జిన్‌లను తిరిగి పొందుతామ ని GCPL, MD CEO సుధీర్ సీతాపతి రెండవ త్రైమాసిక ఫలితాల ప్రకటనపై తెలిపారు. విశేషమేమిటంటే, అంతకుముందు వెనుకబడిన గ్రామీణ మార్కెట్లు, పట్టణ మార్కెట్లతో పోలిస్తే తమ వృద్ధి వేగాన్ని కొనసాగించాయని ఆయన తెలిపారు.

అధిక ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన పట్టణ డిమాండ్'తో సహా సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ వాతావరణం సవాలుగా ఉందని మరో FMCG కంపెనీ డాబర్ ఇండియా పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17.65 శాతం క్షీణించి రూ.417.52 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 5.46 శాతం క్షీణించి రూ.3,028.59 కోట్లకు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories