భారత్‌ చేతికి స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల జాబితా

భారత్‌ చేతికి స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల జాబితా
x
Highlights

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు, సంస్థలు నిర్వహిస్తున్న ఖాతాలకు సంబంధించిన వివరాలతో కూడిన రెండో జాబితా భారత్‌ చేతికి అందింది..

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు, సంస్థలు నిర్వహిస్తున్న ఖాతాలకు సంబంధించిన వివరాలతో కూడిన మరో జాబితా భారత్‌ చేతికి అందింది.. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందం ప్రకారం భారతదేశం అందుకున్న స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలలో ఇది రెండవ సెట్ గా తెలుస్తోంది. ఈ ఏడాది సమాచార మార్పిడిలో దాదాపు 31 లక్షల ఆర్థిక ఖాతాలు ఉన్నాయని ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టిఎ) ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రకటనలో భారతదేశం పేరు ప్రస్తావించనప్పటికీ, వార్తా సంస్థ పిటిఐ కొందరు అధికారులను ఉటంకిస్తూ స్విస్ బ్యాంకుల ఖాతాదారుల మరియు ఇతర ఆర్థిక సంస్థల ఖాతాదారుల ఆర్థిక ఖాతాలపై పత్రం అందుకున్న దేశాలలో భారతదేశం కూడా ఉందని పేర్కొంది. తాజా పత్రాల సెట్లో భారతీయ పౌరులు మరియు సంస్థల యొక్క "గణనీయమైన సంఖ్య" గురించి వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. స్విస్ అధికారులు గత ఏడాదిలో 100 మందికి పైగా భారతీయ పౌరులు మరియు సంస్థలపై సమాచారాన్ని ఇచ్చారు.

ఇందులో పన్ను ఎగవేతతో సహా ఆర్థిక తప్పిదాలకు పాల్పడిన వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. మరోవైపు 2021 సెప్టెంబరులో స్విస్‌ నుంచి మరో జాబితా రానుంది.. స్విస్‌ ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎఫ్‌టీఏ) ఖాతాల సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. కాగా భారత్‌కు అందిన సమాచారం ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు తమ టాక్స్‌ రిటర్నులలో వివరాలను ప్రకటించారా లేదా అన్నది ఈ జాబితా ద్వారా తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories