Corona Effect: అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

India extends ban on international flights till June-end
x

Flight File Photo

Highlights

Corona Effect: క‌రోనా వేవ్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది.

Corona Effect: క‌రోనా వేవ్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది. భార‌త్ నిర్ణ‌యం తీసుకుని దాదాపు 11 నెల‌లు అవుతుంది. ఈ నేప‌థ్యంలోనూ మ‌రో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం విధించినా.. ప్యాసింజర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పలు దేశాలతో భార‌త్‌.. ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. మహమ్మారి మధ్య భారతదేశం, ఇతర దేశాల మధ్య ముందస్తు షరతులతో విమానాలను తిరిగి ప్రారంభించే విధాన‌మే ఈ ఎయిర్ బ‌బుల్ ఒప్పందం ఉద్దేశం. ఇది ఎలా ఉన్నా.. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. మ‌రో 30 రోజులు అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగించింది కేంద్రం.

అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మ‌రో నెల‌పాటు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్ర‌క‌టించింది.. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది డీజీసీఏ.. అయితే, ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చే ప్ర‌త్యేక విమానాలు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌బోవు..అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్న‌ది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ , ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, ఇథియోపియా, జర్మనీ, ఇరాక్, జపాన్, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రువాండా, సీషెల్స్, టాంజానియా, ఉక్రెయిన్ స‌హా 28 దేశాల‌తో భార‌త్‌ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories