India: మెహబూబాబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ED Notices To Mehaboba Mufti
x

మెహబూబా ముఫ్తి (ఫైల్ ఇమేజ్)

Highlights

India: ఈ నెల 15న ఢిల్లీలోని కార్యాలయంలో హాజరు కావాలంటూ ఆదేశం * మనీ లాండరింగ్ ఆరోపణలపై నోటీసులు

India: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్ చేసింది. భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది.. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదని ముఫ్తీ ట్వీట్‌ చేశారు.

జమ్ము కశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికి పైగా గృహ నిర్భంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గతేడాది విడుదల చేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్ డిక్టరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు చెందిన 12 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో గతేడాది ఈడీ జప్తు చేసింది. ఈ ఆరోపణలపై ఇప్పుడు ముఫ్తీకి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories