India-China: భారత్‌-చైనా మధ్య చర్చలకు ముందడుగు

India China Likely to Hold 12th Round of Military Talks Very Soon sources
x

భారత్‌-చైనా మధ్య చర్చలకు ముందడుగు (ఫైల్ ఇమేజ్)

Highlights

India-China: త్వరలో 12వ విడత చర్చలు జరిగే ఛాన్స్‌ * వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్చలు

India-China: భారత్‌-చైనా మధ్య చర్చలకు ముందడుగు పడింది. ఎల్‌ఏసీ వెంబడి, లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో పరిష్కారం దిశగా ముందడుగు వేశాయి. త్వరలో 12వ విడత సైనికపరమైన చర్చలు జరిగే అవకాశాలున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈనెల 26న చర్చలు జరపాలని మొదట చైనా సూచించగా అదేరోజు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నేపథ్యంలో తమ బలగాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాయని భారత్‌ స్పష్టం చేసింది. చర్చలకు మరో తేదీని ఖరారు చేయాల్సిందిగా సూచించింది.

దెప్‌సంగ్‌ మైదానాలు, గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే ఇరువైపులా సమాన సంఖ్యలో బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరితేనే అక్కడి నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు అంగీకరిస్తామని భారత్‌ తేల్చి చెప్పింది. అటు త్వరలోనే ఇరు దేశాల మధ్య సైనికపరమైన చర్చలు జరిపేందుకు ఆసమావేశంలోనే ఇరువురు విదేశాంగ మంత్రులూ అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories