Corona: భారత్ మరో అమెరికా కానుందా..?

India As Another America in Record level Corona Cases
x

కరోనా వైరస్(ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: అమెరికాలో అత్యధికంగా ఒక్క రోజులో మూడు లక్షల కేసులు * భారత్‌లో అత్యధికంగా 2,95,041 పాజిటివ్ కేసులు

Corona: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌ మరో అమెరికా కానుందా..? అంటే రాబోయే రోజుల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. గతేడాది కరోనా విజృంభణకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయింది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసిన శవాల కుప్పలే దర్శనమిచ్చాయి. మృతదేహాలను పూడ్చేందుకు స్థలం కూడా లేకుండా పోయింది.. తర్వాత పరిస్థితులు చక్క దిద్దాయి.

అమెరికా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇండియాలో దాదాపు లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు. అయితే.. అవి ఏమాత్రం పనిచేయకపోవడంతో ఆ తర్వాత క్రమంగా మినహాయింపు ఇవ్వడంతో సెప్టెంబర్‌లో 97వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది సెకండ్ వేవ్ రూపంలో కరోనా తుపాన్‌లా దూసుకొచ్చింది. మొదటి ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారు. అదే సమయంలో మృతి చెందుతున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించారు.. మరోవైపు.. బాధితులకు వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైళ్లలో ఆక్సిజన్ సీలిండర్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కోరత వేధిస్తోంది. దీంతో ఇండియా శవాల దిబ్బగా మారుతోందని.. శ్మాశన వాటికల ముందు మృతదేహాలతో కుటుంబ సభ్యులు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories