భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌
x
Highlights

* అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతి * అస్ట్రాజెనెకా-సీరం కలిసి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ * కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌కు షరతులతో అనుమతిచ్చిన నిపుణుల కమిటీ

కరోనా వ్యాక్సిన్‌పై మరో ముందడుగు పడింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చంటూ సిఫార్సు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ అస్ట్రాజెనెకా-సీరం సంస్థలు కలిసి రూపొందించిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌‌‌‌పై విస్తృతంగా చర్చించిన నిపుణుల కమిటీ చివరికి అనుమతి ఇచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌కు ‌నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. డీసీజీఐ అనుమతి లభిస్తే దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించనున్నారు.

సెంట్రల్‌ డ్రగ్స్ స్టాండర్డ్‌ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ నిపుణుల ప్యానెల్ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు షరతులతో ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే, సెంట్రల్‌ డ్రగ్స్ స్టాండర్డ్‌ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ నిపుణుల కమిటీ సిఫార్సులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిశితంగా పరిశీలించనుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌‌ను అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చో లేదో తేల్చనుంది. ఒకవేళ డీసీజీఐ అనుమతి లభిస్తే అస్ట్రాజెనెకా-సీరం కలిసి రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ను అత్యవసర వినియోగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

మొత్తం 50కోట్ల డోస్‌లను సీరం సంస్థ సిద్ధం చేస్తోంది. భారత్ కోసం 10కోట్ల డోస్‌లను రెడీ చేస్తోంది. భారత్‌లో అత్యవసర వినియోగానికి ఇప్పటికే 5కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సిద్ధంసినట్లు తెలుస్తోంది. ఒక్కో డోస్ ఖరీదు మూడు వందల రూపాయల్లోపే ఉంటుందని చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories