Emergency E-Visa: ఆప్ఘన్ పౌరుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

India Announces Emergency E-Visa for Afghans
x

ఆప్ఘన్ పౌరుల కోసం కేంద్రం కీలక నిర్ణయం

Highlights

New E-Visa: తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది.

New Emergency E-Visa: తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. కాగా ఆదేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అప్ఘన్‌ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. అప్ఘన్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనలపై సమీక్ష చేపట్టిన హోంశాఖ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. భారత్‌కు వచ్చేందుకు అప్ఘన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్‌ట్రాక్‌ పరిశీలన కోసం ప్రత్యేక కేటగిరి ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టిందని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఆప్ఘన్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంశాఖ.. ఈ ఎమర్జెన్సీ ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కేటగిరితో ఎలాంటి మతపరమైన ప్రాధాన్యత లేకుండా అప్ఘన్‌లోని ప్రతి ఒక్కరు వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు సమాచారం. మొదట ఆరు నెలల కాల పరిమితితో ఈ వీసాలు మంజూరు చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలను నిశితంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories