Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు

Independence Day 2024 Live Updates: 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.

Show Full Article

Live Updates

  • 14 Aug 2024 3:18 PM GMT

    దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము



    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అన్ని కుల, మతాలను ఏకం చేసే పండగ స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మేకిన్ ఇండియా, మహిళా సాధికారతతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు ద్రౌపది ముర్ము.

  • 14 Aug 2024 3:12 PM GMT

    దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

     

    మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి...

    వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగింది...

    78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...

    స్వాతంత్ర్య స్ఫూర్తి అనేది ఓ జ్ఞాపకం కాదు...

    మనల్ని ముందుకు నడిపించే ఒక దిక్సూచి...

    స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తి మన నిత్య జీవన గమనానికి ఒక పాఠం..

    మాతృ దేశ అభివృద్ధి కోసం మనం ఎంతగా తపించాలో చెప్పే ఒక మంత్రం...

    ఈ స్ఫూర్తి ప్రతి ఇంటా నింపాలన్న సదుద్దేశంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు...

    ప్రతి ఇంటిపైనా మన జాతీయ పతకాన్ని ఎగురవేసి వందనం సమర్పిద్దాము...

    తిరంగా వేడుకలు గ్రామగ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకుందాము...

    అందుకే పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన విధంగా నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది...

    స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించండి...

    మనకు స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనులను స్మరించుకోండి. ..

Print Article
Next Story
More Stories