పబ్లిక్ పల్స్‌ను అందుకోవడంలో... ఎగ్జిట్ పోల్స్ తలకిందులు

In taking the public pulse exit polls are up and down
x

పబ్లిక్ పల్స్‌ను అందుకోవడంలో... ఎగ్జిట్ పోల్స్ తలకిందులు

Highlights

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేదీన వెలువడటానికి ముందే ఎగ్జిట్ పోల్స్ ఎంతో ఆసక్తిగా వెలువడ్డాయి.

పబ్లిక్ పల్స్‌ను అందుకోవడంలో... ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతున్నాయి. ఒక్కోసారి సర్వే సంస్థలు ఇచ్చే నెంబర్ సక్సెస్ అయినా.. కొన్నిసార్లు బోల్తా కొట్టక తప్పదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే జరిగింది. అందరూ అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పలానా పార్టీదే గెలుపంటూ బల్లగుద్ది చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ.. కౌంటింగ్ కు వచ్చేసరికి తారుమారయ్యాయి.

358...368...371.. ఎన్డీయేకు వచ్చే సీట్లు ఇవే అంటూ దేశవ్యాప్తంగా ఏడుదశల ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు. కానీ ఆ లెక్కలు తప్పాయి. ఏ సర్వే సంస్థ భారత ఓటర్ల నాడిని సరిగా పట్టుకోలేకపోయాయి. ఎంతో పేరుగన్న సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలు ఎక్కడా సక్సెస్ అయింది లేదు. ఎన్డీయే కూటమికి 3 వందల సీట్లే గగనమయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేదీన వెలువడటానికి ముందే ఎగ్జిట్ పోల్స్ ఎంతో ఆసక్తిగా వెలువడ్డాయి. మొత్తమ్మీద కేంద్రంలో మళ్లీ మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కొలువు దీరుతుందని అంచనా వేశాయి.దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి అధిక సంఖ్యాక ప్రజలు పట్టం కడుతున్నట్టుగా సర్వే సంస్థలు అంచనా వేశాయి. 543 నియోజకవర్గాలున్న లోక్ సభలో అధికారం దక్కాలంటే ఏ పార్టీకైనా 272 సీట్లు రావాలి. అయితే రిపబ్లిక్ మేట్రిజ్ అంచనా ప్రకారం ఎన్డీయే 353 నుంచి 368 సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ అలయెన్స్ 118 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది.ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా 379 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తెలిపింది. జన్ కీ బాత్ సర్వే కూడా ఎన్డీయేకు 362 నుంచి 392 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది.

ఇక ఎన్డీయే 350కి పైగా సీట్లతో మూడోసారి అధికారం చేపడుతుందని అంచనా వేసిన సర్వే సంస్థలన్నీ ఇండి కూటమికి 150కి మించి సీట్లు ఇవ్వలేదు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్‌కు, ఎగ్జిట్ పోల్స్‌కు భారీ తేడా కనిపించింది. అసలు ఎన్డీయేకు, ఇండి బ్లాక్ పోటీనే కాదంటూ సర్వేలు తేల్చగా.. కౌంటింగ్‌లో ఎన్డీయేకు చెమటలు పట్టించేంత పనిచేసింది విపక్ష కూటమి. కాంగ్రెస్‌ వందకు పైగా సీట్లు, కూటమి మొత్తం 2 వందలకు పైగా సీట్లను కైవసం చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరోసారి ఊహించని ఫలితాలను ఇచ్చారు ఏపీ ప్రజలు. ఎగ్జిట్ పోల్స్‌కు ఎగ్జాక్ట్ పోల్స్‌కు ఎక్కడా పొంతన లేకుండా...ఏపీ ఎన్నికల తుది ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఎవరికీ అందనంత స్థాయిలో విజయాలను సాధించారు. జూన్ 1న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వే సంస్థలు..వైసీపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని వెల్లడించారు. చిన్న సర్వే సంస్థల నుంచి... పెద్ద సర్వే సంస్థల వరకూ.. పోటాపోటీగా ఉండన్నట్టు తెలిపారు.గతంలో ఆక్యురేట్‌గా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా మస్తాన్ సంస్థ.. ఈ సారి వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. కానీ వైసీపీ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. పార్థదాస్ సంస్థ 110 నుంచి 120 వరకూ వైసీపీ గెలుస్తుందని... టీడీపీ అయితే.. 55 నుంచి 65 మధ్యే ఉంటుదని పేర్కొంది. ఇక స్మార్ట్ పోల్.. జన్‌మత్, చాణక్య సైతం... స్వల్ప తేడాతోనే వైసీపీకే మెజార్టీ వస్తుందని వెల్లడించాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ ముందు ఆ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేలిపోయాయి. టీడీపీకి ఏ సర్వే సంస్థ ఊహించనన్ని సీట్లతో తెలుగుదేశం.. సైకిల్ పార్టీ దూసుకెళ్లింది. ఒక్క కేకే సర్వే ఇచ్చిన అంచనా మాత్రమే నిజమైంది.

ఇక ఏపీ ఎన్నికల్లో గెలుపోటములపై సెఫాలజీ నిపుణులే కాదు.. జ్యోతిష‌్య పండితులూ అంచనాలు వేశారు. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో పేరుమోసిన వేణుస్వామి కూడా వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. ఆయన చెప్పారంటే నిజమే అవుతుందంటూ అక్కడ గెలుపోటములపై బెట్టింగులు కూడా జోరుగా నడిచాయి. కానీ చివరకు ఆయన అంచనా కూడా బోల్తా కొట్టింది. దాంతో ఇకపై రాజకీయ విశ్లేషణలే చేయనంటూ వెల్లడించారు వేణుస్వామి.

అయితే.. కేవలం ఏపీలోనే కాక.. అన్ని రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఘోరంగా విఫలం అయినట్టు తెలుస్తుంది. కానీ.. ఒక్క తెలంగాణలోనే సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలనే.. తెలంగాణల ఓటర్లు స్పష‌్టం చేశారు. కాంగ్రెస్‌కు 8 నుంచి 10 బీజేపీకి 8 నుంచి 10 బీఆర్ఎస్‌కు ఒకటి లేదా సున్నా... ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటుందని.. స్పష‌్టం చేయగా... ఓటర్లు సైతం అదే విధంగా తీర్పునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories