PM Modi On Crimes Against Women: మహిళలపై నేరాలు..క్షమించారని పాపం..దోషులను విడిచిపెట్టేది లేదు

In Lakhpati Didi Conference  PM Modi said  Crime against women is unforgivable sin, laws impose strict punishments
x

PM Modi On Crimes Against Women: మహిళలపై నేరాలు..క్షమించారని పాపం..దోషులను విడిచిపెట్టేది లేదు

Highlights

PM Modi On Crimes Against Women:మహిళలపై నేరాలకు పాల్పడటం క్షమించారని పాపమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యత అని మోదీ ఈ సందర్బంగా అన్నారు. మహారాష్ట్రలోని లఖ్ పతీ దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని నారీమణులపై పెరుగుతున్న ఆక్రుత్యాలపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు.

PM Modi On Crimes Against Women: మహిళలపై జరిగే నేరాలను క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. ముంబై సమీపంలోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల బాలికలపై లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో జరిగిన 'లఖపతి దీదీ సమ్మేళనం'లో ప్రధాని ప్రసంగిస్తూ, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశం ప్రాధాన్యత అని ఆయన అన్నారు. ఎర్రకోట నుంచి ఈ సమస్యను పదే పదే లేవనెత్తాను. దేశం పరిస్థితి ఎలా ఉన్నా, నా సోదరీమణుల, కుమార్తెల బాధ నాకు అర్థమవుతాయని మోదీ అన్నారు.

మహిళలపై నేరాలు క్షమించరాని పాపమని ప్రతి రాజకీయ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతానని మోదీ అన్నారు. దోషులెవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 'మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సహాయకులను కూడా వదిలిపెట్టకూడదు' అని ప్రధాని మోదీ అన్నారు. ఆసుపత్రి అయినా, పాఠశాల అయినా, ప్రభుత్వం అయినా, పోలీస్ స్టేషన్ అయినా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉండాలన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం మహిళల కోసం చేసిన కృషి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన 'లఖపతి దీదీ' ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ, మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధించేందుకు తమ ప్రభుత్వం చట్టాలను పటిష్టం చేస్తోందన్నారు. '2014 సంవత్సరం వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25 వేల కోట్ల లోపే రుణాలు ఇవ్వగా, గత 10 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు (రుణాలు) ఇచ్చామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.

జల్‌గావ్‌లో 'లఖపతి దీదీ'తో ప్రసంగించిన వేళ.. మోదీ రూ. 2,500 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇది 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 'లఖపతి దీదీ యోజన' లక్ష్యం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాదు, భవిష్యత్ తరాలకు సాధికారత కల్పించడమేనని ప్రధాన మంత్రి అన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందన్నారు.

అటు నేపాల్‌ బస్సు ప్రమాదంలో జల్‌గావ్‌ జిల్లాకు చెందిన 14 మంది మృతి చెందడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మా మంత్రి రక్షా ఖడ్సేను నేపాల్‌కు పంపాం’ అని మోదీ అన్నారు. ఇటీవల పోలాండ్‌లో పర్యటించినందుకు, అక్కడి ప్రజలు మహారాష్ట్ర ప్రజల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రధాని ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొల్హాపూర్‌లో పోలిష్ శరణార్థులను ఉంచారని, అందుకే పోలాండ్ ప్రజలకు మహారాష్ట్ర ప్రజల పట్ల గౌరవం ఉందని మోదీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories