IIT Madras Launch online B.Sc Degree Course: ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్‌ రెగ్యులర్‌ బీఎస్సీ డిగ్రీ కోర్సు ప్రారంభం

IIT Madras Launch online B.Sc Degree Course: ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్‌ రెగ్యులర్‌ బీఎస్సీ డిగ్రీ కోర్సు ప్రారంభం
x
Highlights

IIT Madras Lanches online B.Sc Degree Course: డేటా సైన్స్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ బీఎస్సి డిగ్రీ, డిప్లమా చేయాలనుకునే విద్యార్ధులకు ఐఐటీ మద్రాస్‌ గొప్ప అవకాశం కల్పిస్తోంది

IIT Madras Lanches online B.Sc Degree Course: డేటా సైన్స్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ బీఎస్సి డిగ్రీ, డిప్లమా చేయాలనుకునే విద్యార్ధులకు ఐఐటీ మద్రాస్‌ గొప్ప అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు ఈ కోర్సులను విద్యార్ధులకు డిస్టెన్స్ లో కాకుండా రెగ్యులర్‌ విధానంలో ఉంటుంది. ఈ ఆన్ లైన్ కొర్సులను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రారంభించారు. డేటా సైన్స్‌లో మూడేళ్ల వ్యవధి కలిగిన బీఎస్సీ ఫుల్‌ టైం డిగ్రీ, ఐఐటీ మద్రాస్‌ సిద్ధం చేసిన ఈ డిగ్రీలో ప్రోగ్రామింగ్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌ రామ్మూర్తి తెలిపారు.

పదో తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివి, పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల పూర్తి వివరాలను విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటే వివరాల కోసం https://onlinedegree.iitm.ac.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చని తెలిపారు. కోర్సు మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది కానీ పరీక్షలు, ఇతర అసెస్‌మెంట్‌లు మాత్రం ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌లో ప్రపంచంలోనే తొలి బీఎస్సీ డిగ్రీ కోర్సు ఇదేనని పేర్కొన్నారు. ఈ కోర్సు ప్రపంచంలోనే తొలి ఆన్‌లైన్‌ రెగ్యులర్‌ డిగ్రీ కోర్సు. దీంతో ఐఐటీ డిగ్రీ సాధించాలన్న కలను ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవచ్చని ఆయన అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories