Omicron Test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం..రూపొందించిన ఐసీఎంఆర్‌

ICMR Designs kit for Omicron Detection
x

Omicron Test: ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కొత్త పరికరం..రూపొందించిన ఐసీఎంఆర్‌

Highlights

Omicron Test: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ను ముందుగానే గుర్తించేందుకు ఐసీఎమ్​ఆర్ సరికొత్త కిట్​ను రూపొందించింది.

Omicron Test: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ను ముందుగానే గుర్తించేందుకు ఐసీఎమ్​ఆర్ సరికొత్త కిట్​ను రూపొందించింది. ఈ కిట్​ను కమర్సియల్ గా ఉపయోగించుకునేందుకు కిట్లను సొంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు IVD కిట్​ తయారీదారుల నుంచి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్​ను గుర్తించేందుకు కావాల్సిన RTPCR, కిట్​ను డిబ్రుగఢ్​లోని ఐసీఎమ్​ఆర్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది.

దీనిపై పేటెంట్ హక్కులు, కమర్సియల్ హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. అగ్రిమెంట్ కుదుర్చున్న వారికి కిట్​ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్​లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ సమయంలో ఐసీఎమ్​ఆర్​ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories