Wayanad Landslides: వయనాడ్‌లో ప్రకృతి విలయంతో వందలాది మంది మృతి

Hundreds of people died due to natural disasters in Wayanad
x

Wayanad Landslides: వయనాడ్‌లో ప్రకృతి విలయంతో వందలాది మంది మృతి

Highlights

Wayanad Landslides: డబుల్ క్రైసిస్‌ను ఎదుర్కొంటున్న వయనాడ్ వాసులు

Wayanad Landslides: ఒకప్పుడు శక్తివంతమైన ప్రాంతంగా ఉన్న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వినాశన దృశ్యంగా మారింది. వయనాడ్‌‌లో ప్రకృతి విలయం సృష్టించగా... దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు మానవతా సంక్షోభం... మరోవైపు దొంగతనాలతో డబుల్ క్రైసిస్‌ను వయనాడ్ ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఐదు రోజుల క్రితం వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి విలయం సృష్టించగా... సుమారు 300 మంది చనిపోయారు. మరో 200 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా కొండచరియల విధ్వంసంతో గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను బాధితులు వదిలిపెట్టాల్సి వచ్చింది. బాధితులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు.

కొండ చరియలు విరిగిపడి ప్రాణాలతో బయటపడి తప్పించుకున్నా... చాలా మందికి కష్టాలు తీరడం లేదు. కేరళ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం అయిన వయనాడ్ విలయ ప్రదేశంలో దొంగతనాలు జరుగుతున్నాయి. విడిచిపెట్టిన ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండచరియలు విరిగిపడడంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ కోరుతున్నారు.

ప్రకృతి విలయం జరిగిన ప్రాంతాలలో పోలీసులు రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, ఇతర కారణాలతో ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలులేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories