ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల పేరిట పన్నాగం.. కేటుగాళ్ల గుట్టురట్టు

ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల పేరిట పన్నాగం.. కేటుగాళ్ల గుట్టురట్టు
x
Highlights

నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.112 కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేసిన కేటుగాళ్ల..

నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.112 కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేసిన కేటుగాళ్ల గుట్టురట్టయింది. చివరి నిమిషంలో అధికారులు అప్రమత్తం కావడంతో మోసం బెడిసికొట్టింది. ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తాలోని మూడు బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకునేందుకు కొందరు దుండగుల విఫలయత్నం చేశారు. సీఎంఆర్‌ఎఫ్ కి వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచిలో బ్యాంకు అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ద్వారా బాధితులకు సహాయం అందుతుంది. ఈ క్రమంలో ఇటీవల సీఎంఆర్‌ఎఫ్ అధికారులు‌ జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్‌బీఐ చెక్‌ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో శుక్రవారం ఓ వ్యక్తి చెక్కు డ్రాప్ చేశాడు.

అంత పెద్ద మొత్తం కావడంతో సీఎంఆర్‌ఎఫ్ చెక్‌ను చూసిన బ్యాంకు అధికారులకు చివరి నిమిషంలో అనుమానం వచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులను వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే సీఎంఆర్‌ఎఫ్ అధికారులు అంత పెద్ద మొత్తంతో తాము ఎవరికీ చెక్‌ ఇవ్వలేదని చెప్పారు. దాంతో భారీ మోసం బయటపడింది. డబ్బు పెద్ద మొత్తంలో కావడంతో కృష్ణా జిల్లా వెలగపూడిలోని ఎస్బీఐని మంగళూరు బ్రాంచ్ అధికారులు సంప్రదించారు. వెంటనే అధికారులు ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలకు ఈ విషయం తెలియజేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదే కాదు ఢిల్లీలోని ఎస్‌బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్‌లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ ఖాతా నుంచి ఎస్‌బీఐ చెక్‌ను డిపాజిట్ చేయడమే కాకుండా.. కోల్‌కతలోని మోగ్రాహట్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. ఇవన్నీ నకిలీ చెక్కులని తేలింది. మూడు చెక్కులు విజయవాడ,ఎంజీ రోడ్‌లో ఉన్న బ్రాంచ్‌కు చెందినట్లుగా గుర్తించిన అధికారులు.. చెక్కులపై సీఎంఆర్‌ఎఫ్, రెవెన్యూ శాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్‌ అన్న స్టాంప్‌పై సంతకాలు చేసి ఉన్నాయి. ఇక భారీ కుంభకోణం కావడంతో ఘటనపై సీరియస్ గా దృష్టి సారించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా లకు ప్రత్యేక బృందాలను పంపి నకిలీ చెక్కుల క్లియరెన్స్ కోసం వచ్చిన వ్యక్తుల CCTV ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories