మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు

Hourly Changing Politics in Maharashtra | Maharashtra Political Crisis
x

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు

Highlights

Maharashtra Political Crisis: నేడు శివసేన జిల్లా ముఖ్యులతో సంభాషించనున్న థాక్రే

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన నంబర్ గేమ్.. పూటకో మలుపు తిరుగుతోంది. రెబల్స్ క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నా.. శివసేన, మిత్రపక్షాలు మాత్రం బలనిరూపణలో నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శివసేన 24 ఆవర్స్ ఆఫర్ ఇచ్చినా మెట్టుదిగడం లేదు. అనర్హత అస్త్రాన్ని సంధిస్తామని వార్నింగ్ ఇచ్చినా తగ్గేదేలే అంటోంది షిండే టీమ్.

మహారాష్ట్ర రాజకీయాలు కీలక ములుపు తిరుగుతున్నాయి. నేడు శివసేన జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సీఎం ఉద్ధవ్ థాక్రే భేటీకానున్నారు. శివసేన పార్టీ చిహ్నమైన విల్లు మరియు బాణంపై.. దావా వేయాలని షిండే వర్గం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలతో ఉద్ధవ్ థాక్రే సమావేశం అవుతున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత జరిగిన పరిణామాలపై ఈ సమావేశంలో జిల్లా నేతలతో చర్చించనున్నారు.

12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సీఎం ఉద్దవ్ థాక్రే, డిప్యూటీ స్పీకర్‌కు నరహరి జిర్వాల్ కు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి డిప్యూటీ స్పీకర్ పైనే ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనర్హత వేటు పడితే పరిస్తితి ఎంటి..? షిండే టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మహావికాస్ అగాడీ గట్టున పడే ఛాన్స్ ఉందా అనే అంశాలపై చర్చ జరుగుతోంది.

మరోవైపు, ప్రతిగా రెబల్స్ టీమ్ షిండేను తమనేతగా ఎన్నుకుంది. అమిత్‌షాతో చర్చల కోసం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీలో మకాం వేశారు. ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి సాయం చేసేందుకు ఫడ్నవీస్‌ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శరద్ పవార్ బెదిరింపుపై.. కేంద్రమంత్రి నారాయణ్ రాణే మాట్లాడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories