G20 Summit: శ్రీన‌గ‌ర్‌లో చారిత్రాత్మక జీ-20 సదస్సు.. జ‌మ్మూకాశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

Historic G20 Summit in Srinagar
x

G20 Summit: శ్రీన‌గ‌ర్‌లో చారిత్రాత్మక జీ-20 సదస్సు.. జ‌మ్మూకాశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

Highlights

G20 Summit: షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం

G20 Summit: జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నేడు ప్రారంభం కానున్న జీ - 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్‌ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు.

మరో వైపు జమ్మూలో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా, సౌదీ అరేబియా ఇప్పటివరకూ సమావేశంలో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ నిర్ణయించింది. ఇక, అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories