Hindenburg Research: మరో సంచలన నివేదిక వెల్లడించిన హిండెన్‌బర్గ్
Hindenburg Research: ట్విట్టర్ ఫౌండర్ డోర్సీ సంస్థపై హిండెన్‌బర్గ్ నివేదిక
Hindenburg Research: గతేడాది భారత్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ పై విమర్శలు చేసిన US షార్ట్ షెల్లింగ్ సంస్థ `హిండెన్ బర్గ్ ` మరో సంచలన నివేదిక బయటపెట్టింది. త్వరలో అతిపెద్ద నివేదిక బయట పెడతామని ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో నివేదిక వెల్లడించింది. ఈ సారి ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీని లక్ష్యంగా చేసుకుంది. జాక్ డోర్సీ ఆధ్వర్యంలోని పేమెంట్స్ సంస్థ అయిన 'బ్లాక్' అక్రమాలను టార్గెట్ చేసింది. ఈ బ్లాక్ సంస్థ భారీ అక్రమాలు చేసిందని పేర్కొంటూ హిండెన్ బర్గ్ తన ట్విట్టర్ ఖాతాలో సంబంధిత నివేదిక లింక్ ను ట్వీట్ చేసింది. జాక్ డోర్సీ సారధ్యంలోని ఈ బ్లాక్ సంస్థ తన ఖాతాదారుల సంఖ్య ఎక్కువ చేసి, ఖర్చులు తక్కువ చూపి ఇన్వెస్టర్లను మోసగించిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. రెండేండ్లుగా తాము చేసిన పరిశోధనలో `బ్లాక్ `లో జరిగిన పలు కీలకాంశాలు గుర్తించామని తన నివేదికలో వెల్లడించింది.
NEW FROM US:
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ
(1/n)
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire