హిమాచల్​ప్రదేశ్‌లో భారీగా హిమపాతం.. పంట పొలాలు, తోటలను కప్పేసిన మంచు చరియలు

Heavy Snowfall in Himachal Pradesh
x

హిమాచల్​ప్రదేశ్‌లో భారీగా హిమపాతం.. పంట పొలాలు, తోటలను కప్పేసిన మంచు చరియలు 

Highlights

Himachal Pradesh: పీర్‌పంజల్ పర్వతాల నుంచి విరిగిపడిన మంచు చరియలు

Himachal Pradesh: హిమాచల్​ప్రదేశ్‌లోని లాహౌల్ వ్యాలీలో హిమపాతం విరుచుకుపడింది. పీర్ పంజల్ పర్వతాల నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ రైతుల పొలాలు, తోటలకు నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. కొండపై నుంచి మంచు చరియలు పడడం వల్ల పెద్ద శబ్దం వచ్చిందని గోషాల్ గ్రామస్తులు చెప్పారు. భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి వచ్చామన్నారు. మంచు చరియలు పడి తమ పొలాలపై మంచు కప్పేసిందని రైతులు వాపోయారు. హిమపాతం చంద్రభాగ నదిని దాటి మరో గ్రామానికి చేరుకుందని వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని మంచు కురువడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమయిందని లాహౌల్ స్పితి కలెక్టర్ సుమిత్ చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా మూడు జాతీయ రహదారులు మూసివేసినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories