Delhi: ఢిల్లీలో భారీగా భద్రతా దళాల నిఘా

Heavy Security Forces Surveillance in Delhi | National News Today
x

ఢిల్లీలో భారీగా భద్రతా దళాల నిఘా

Highlights

Delhi: ఈసారి అరగంట ఆలస్యంగా గణతంత్ర వేడుకలు

Delhi: ఢిల్లీలో భద్రతను రక్షణ దళాలు మరింత కట్టుదిట్టం చేశాయి. ఎక్కడికక్కడ భారీ నిఘా పెట్టాయి. గణతంత్ర వేడుకులకు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

సమస్యాత్మక ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌తో కూడిన సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫేస్‌ రికగ్నేషన్ సాఫ్ట్‌వేర‌ ద్వారా.. కనిపిస్తున్న వ్యక్తులు ఎవరో ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ఢిల్లీలోని 30 సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటి సీసీ కెమెరాలను వాడుతున్నట్టు భద్రతా దళాలు తెలిపాయి.

గణతంత్ర వేడుకల సందర్భంగా 65 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా 27వేల మంది పోలీసులను భద్రతా ఏర్పాట్ల కోసం మోహరించారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

గణతంత్ర వేడుకలకు ఢిల్లీ ముస్తాబయింది. వేడుకల్లో భాగంగా శకటాల ప్రదర్శనకు, త్రివిధ దళాలలు పరేడ్‌కు సిద్ధమయ్యాయి. రాజధానిలోని ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఈసారి రిపబ్లిక్‌ వేడుకలు అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories