Heavy Rains in Mumbai: ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు..
Heavy Rains in Mumbai: ముంబైలో భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి.
Heavy Rains in Mumbai: ముంబైలో భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి. వరద నీరుపూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోయింది దీనితో ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెంబూర్, పరేల్, హింద్మాత, వడాలా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాల ప్రభావంతో హార్బర్ లైన్‌లోని CSMT స్టేషన్లు, మెయిన్ లైన్‌లోని CSMT కుర్లా, చర్చగేట్-కుర్లా స్టేషన్ల మధ్య సబ్ అర్బన్ రైళ్లను నిలిపివేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షం నీరు నిలిచి పోవటంతో మసీదు-భయ్‌ఖలా స్టేషన్ల మధ్య రెండు రైళ్లు చిక్కుకుపోయాయి. ఆ ప్రదేశానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని పడవల సాయంతో ప్రయానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గక పోవటంతో గతంలో(2005) వరదల తరహాలోనే భారీ ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని.. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచించారు.
#WATCH Mumbai: 40 people rescued by National Disaster Response Force after 2 local trains got stuck between Masjid & Bhaykhala stations due to water on tracks. (Video source-NDRF) pic.twitter.com/ADShmBk9s3
— ANI (@ANI) August 5, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire