Heavy Rains: కేరళ, ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం

Heavy Rains in Uttarakhand and Kerala
x
ఉత్తరాఖండ్ మరియు కేరళలో వర్షం బీబత్సం (ఫైల్ ఇమేజ్) 
Highlights

Heavy Rains: ఉత్తరాఖండ్‌లో 46కు చేరిన మృతుల సంఖ్య * గల్లంతైన 11 మంది కోసం గాలింపు చర్యలు

Heavy Rains: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జల విలయం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 46 మంది మరణించారు. మరో 11 మంది గల్లంతయ్యారు. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతికి పలు వంతెనలు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌కు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ మూసుకుపోయాయి. జిల్లా కేంద్రం నుంచి బయటి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో రానున్న రెండుమూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొట్టాయం జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. వరదలతో ఇడుక్కి, పంబా, కక్కీతో పాటు మరో 78 జలాశయాలు పూర్తి్స్థాయిలో నిండిపోవడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం స్తంభించిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories