Top 6 News @ 6PM: దామగుండంలో నేవీ రాడార్ కేంద్రానికి కేంద్రం శంకుస్థాపన.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Top 6 News @ 6PM: దామగుండంలో నేవీ రాడార్ కేంద్రానికి కేంద్రం శంకుస్థాపన.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్
x
Highlights

1) Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం...

1) Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది. అటు తెలంగాణలో మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తీవ్ర టాపిక్ జామ్ ఏర్పడింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, మాదాపూర్, కూకట్ పల్లి, సూచిత్ర ఏరియాల్లో కుండపోత వర్షం కురిసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) DSC 2024 Counselling Postponed: కొత్త టీచర్లకు బిగ్ షాక్..పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా..త్వరలోనే పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు

Telangana DSC 2024 Counselling Postponed: తెలంగాణలో కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది విద్యాశాక. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్స్ ఇవ్వున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు. అయితే కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది విద్యాశాఖ.

3) TG Groups-1: గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్.. తొలగిన అడ్డంకి.. యాథావిధిగా మెయిన్స్ పరీక్షలు

TG Groups-1: తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్ 1 పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని, 7 ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. కోర్టులో పిటిషన్ల అడ్డంకి తొలగిపోవడంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.

4) Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం..ఆ దర్శనాలు రద్దు

TTD News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే టీటీడీ కీలక సంచలన ప్రకటన చేసింది. భారీ వర్షాల పడవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అప్రమత్తమైంది. వర్షాలు భారీగా కురుస్తున్ననేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చి ఇబ్బందులకు గురి కాకుడదన్న ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) India-Canada: భారత్ -కెనడా మధ్య ముదురుతున్న వివాదం..కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

India-Canada dispute: భారత్, కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అసంబద్ధ ఆరోపణల మధ్య భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. భారత్ లో ఉన్న ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. వెంటనే భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత్, కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత పెరిగింది. భారత ప్రభుత్వం సోమవారం సాయంత్రం కెనడా ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో, ఇప్పుడు కెనడాపై భారత్ మరో కఠిన చర్య తీసుకుంది. భారత ప్రభుత్వం 6 మంది కెనడా దౌత్యవేత్తలను దేశం నుండి బహిష్కరించింది. వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని హుకూం జారీ చేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Damagundam Forest: దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన

Navy's VLF Radar Station: దామగుండం అటవీ ప్రాంతంలో ఇవాళ భారత నౌకాదళానికి చెందిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యునికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. రక్షణ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భూమిపూజ కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లా పూడురు మండలం పరిధిలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టులో 2900 ఎకరాలను దాదాపు 6 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నేవీ కమాండ్ ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం పనులను పర్యవేక్షించనుంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories