Landslide in Kerala: కేరళలో భారీ వర్షాలు.. 42కు చేరిన మృతుల సంఖ్య

Landslide in Kerala: కేరళలో భారీ వర్షాలు.. 42కు చేరిన మృతుల సంఖ్య
x
Land Slide in Kerala Due to Heavy Rains
Highlights

Landslide in Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి అని తెలిసిందే.

Landslide in Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి అని తెలిసిందే. పర్యాటక పట్టణం మున్నార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నకేరళ జిల్లాలోని రాజమలై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు.. ఈ ప్రాంతంలో 70 నుంచి 80 మంది ప్రజలు నివసించినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

ఘటన జరిగిన ప్రాంతంలోని వంతెన కొట్టుకుపోయిందని.. ఈ ప్రాంతానికి చేరుకోవటం కష్టమని అధికారులు తెలిపారు. అంతేకాదు, కటినమైన భూభాగాలతో రెస్క్యూ బృందాలు కూడా తమ సాయశక్తుల ప్రయత్నాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనలో ఇపటి వరకు 42 మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలలో భాగంగా నేడు 16 మృతదేహాలు లభ్యం అయినట్లు తదికరులు తెలిపారు. రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకం కల్గిస్తున్నాయని తెలిపారు.. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 30 మంది కనిపించకుండా పోయారు అని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories