Heavy Rains in AP & TS: తెలుగు రాష్ట్రాలను ముంచేస్తోన్న వరుణుడు

Heavy Rains in Andhra Pradesh and Telangana States From Today 12 07 2021 | Heavy Rains in AP 2021
x

Heavy Rains: (File Image)

Highlights

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in AP & TS: రెండు తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేస్తున్నాడు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని వున్న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయపి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. ఊహించనంత ప్రమాదకరంగా కొన్ని చోట్ల పరిస్థితులు మారుతున్నాయి.

ఏపీలో...

ఏపీ లోనూ ఆకాశాన మబ్బులు కమ్మేశాయి. కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలోనూ ఇదే విధంగా ఉంటుందని స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటలకు 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో కురిసిన భారీ వర్షం కురిసింది. కుమ్మరి వీధి డ్రైనేజీలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కొట్టుకుని పోయి మృతి చెందాడు. మృతుడు తోటవారి వీధికి చెందిన గండ్రోతుల నాగసుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

తెలంగాణలో...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.

మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజికి భారీగా వరద వస్తోంది. బ్యారేజిలో 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 95,960 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా.. లక్షా 2వేల 840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16 .17 టీఎంసీలకు గాను 13.3 టీఎంసీలకు నీటిని నిల్వ ఉంచారు.రుతుపవనాలు కూడా వేగం పుంజుకోవడంతో మరింత మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని. అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారాలు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories