Heavy Rain in Delhi: భారీ వర్షాలు వరదలతో ఢిల్లీ అతలాకుతలం

Heavy Rain in Delhi: భారీ వర్షాలు వరదలతో ఢిల్లీ అతలాకుతలం
x
Heavy Rain in Delhi
Highlights

Heavy Rain in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హస్తినలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు సైతం చెరువుల్ని తలపిస్తున్నాయి.

Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హస్తినలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు సైతం చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. ఐటిఓ ,అన్న నగర్ సమీపంలోని మురికివాడలలో కాలువల పక్కనే ఉన్న ఇళ్ళు భారీ వర్షాలకు కుప్పకూలి కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐకానిక్ మింటో వంతెన కింద ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. అతడు చండీగఢ్ కు చెందిన కుందన్ (56) గా పోలీసులు గుర్తించారు.

ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనుందని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. కీర్తినగర్, రాజ్‌పథ్, రైల్ భవన్, మింటో రోడ్, ఇండియా గేట్, తీన్ మూర్తి మార్గ్ సహా పలు ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం వర్షం కురవడంతో రోహ్‌తక్, సోనిపట్, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాబ్, ఫరిదాబాద్తో పాటు రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories