Assam: భారీ వర్షాలకు అస్సాం అస్తవ్యస్తం.. ముంచెత్తిన వరదలు

Heavy Rain in Assam
x

Assam: భారీ వర్షాలకు అస్సాం అస్తవ్యస్తం.. ముంచెత్తిన వరదలు

Highlights

Assam: ప్రమాదస్ధాయికి మించి ప్రవహిస్తున్న నదులు

Assam: ఈశాన్య భార‌త రాష్ట్రమైన అసోంను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా 20 జిల్లాల్లో లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. రోడ్డు వంతెన వద్ద నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అలాగే, ఎన్టీ రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా-ఎన్ హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమారి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదికల ప్రకారం, అస్సాం, ఇతర పొరుగు రాష్ట్రాలు-పొరుగు దేశం భూటాన్ లో కుండపోత వర్షాల కారణంగా, అనేక నదుల నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

ఇప్పటికే చాలా ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. రోడ్ బ్రిడ్జి వద్ద బెకి నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎన్టీ రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా, ఎన్ హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమారి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నాయి. కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, ఉదల్గురి జిల్లాల్లోని చాలా ప‌ట్టణాలు, గ్రామాలు వరదలతో ప్రభావితమయ్యాయి.

జిల్లా యంత్రాంగం 14 సహాయ శిబిరాలు, 17 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజ‌లు మంది బక్సా, ధుబ్రి, కోక్రాఝర్, నల్బరి, జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. వరద ప్రభావిత జిల్లాల్లో వరదల్లో పెంపుడు జంతువులు, కోళ్లు కూడా ప్రభావితమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ జనాలపు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. వరద నీరు 4 కరకట్టలు, 72 రోడ్లు, 7 వంతెనలను ధ్వంసం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories