Supreme Court: నేడు పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Hearing on Pegasus Spyware Affair in Supreme Court Today 27 10 2021
x

పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ * ఇవాళ తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

Supreme Court: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. తుది వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు సెప్టెంబరు 13న ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి అక్రమంగా పౌరులపై నిఘా పెట్టిందా? లేదా? అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తెలుసుకోనున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

దీనిపై దర్యాప్తునకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. కమిటీ ఏర్పాటుకు సుముఖమేనని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయమై సవివరంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించలేమని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories