Jalebi: దేశవ్యాప్తంగా జిలేజీ రచ్చ.. ట్రెండింగ్‎లో జిలేబీ.. అసలు సంగతి ఇదే

Haryana Elections Results Jelebi Factor Rahul Gandhi Narendra Modi Speech BJP Wins in Haryana Full Details
x

Jalebi: దేశవ్యాప్తంగా జిలేజీ రచ్చ.. ట్రెండింగ్‎లో జిలేబీ.. అసలు సంగతి ఇదే

Highlights

Haryana Elections Jalebi Factor: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బిజెపి) కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని జిలేబితో పోల్చుతూ ట్రోల్ చేసింది. బీజేపీ అన్ని కార్యాలయాల్లో జిలేబీ పంపిణీ చేయడమే కాకుండా రాహుల్ గాంధీ ఇంటికి కిలో జిలేబీ పంపింది. దీంతో హర్యానా వ్యాప్తంగా జిలేబీ గురించి చర్చ షురూ అయ్యింది. ఇప్పుడే జిలేబి ట్రెండింగ్ అవుతోంది. అసలు ఈ జిలేబి గోల ఏంటో తెలుసుకుందాం.

Haryana Elections Jalebi Factor: హర్యానాలో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తారుమారు చేసింది. ఈ విజయం పట్ల ప్రధాని మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తామే అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఉద్దేశిస్తూ ప్రస్తుతం నెట్టింట్లో బీజేపీ కార్యకర్తలు జిలేబి అంటూ గోలగోల చేస్తున్నారు. ఇంతకీ హర్యానా ఎన్నికలకు జిలేబీకి సంబంధం ఏంటో తెలసుకుందామా.

ఎన్నికల ప్రచారంలో భాగంగా, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జిలేబీ ప్రస్తావని తీసుకువచ్చారు. గుహనా ప్రాంతంలో ప్రసంగించారు. మాథురామ్ హల్వాయి దగ్గర నుంచి తెచ్చిన స్వీట్ల బాక్స్ ను పట్టుకుని, వీటిని దేశవ్యాప్తంగా విక్రయించి, ఎగుమతి చేయాలన్న తన ఆలోచనను షేర్ చేశారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని..20,000 నుంచి 50,000మందికి ఉద్యోగ అవకాశాలు దొరకవచ్చని తెలిపారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..మాథురామ్ వంటి వ్యాపారవేత్తలు డిమానిటైజేషన్, జీఎస్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నారని పేర్కొన్నారు.

గోహనాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రముఖ మతురం హల్వాయి తయారు చేసిన జిలేబీ పెట్టెను చూపించి దేశమంతటా విక్రయించాలని, ఎగుమతి కూడా చేయాలని అన్నారు. దీంతో మరిన్ని ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు. అప్పుడు ఈ మిఠాయి దుకాణాన్ని ఫ్యాక్టరీగా మార్చి 20 నుంచి 50 వేల మంది వరకు పని చేయవచ్చు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల మతురం లాంటి వ్యాపారులు నష్టపోయారని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ ఈ ప్రకటనపై బీజేపీ నేతలు విస్తుపోయారు. గోహనా జలేబీ అంటే తనకు కూడా ఇష్టమని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అమెరికాలో ఫ్యాక్టరీ పెట్టాలని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, అయితే జిలేబీని ఎలా తయారు చేసి విక్రయిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఆయనకు చిట్ రాసిన వారు సరిగ్గా రాసి ఉంటే బాగుండేది. రాహుల్‌గాంధీ తన హోంవర్క్‌ సరిగా చేయడం లేదని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో గోహనా జలేబీ గురించి చెప్పారు. ఇండియా కూటమిపై దాడి చేస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అవుతారనే ఫార్ములా విపక్షాల వర్గానికి ఉందని అన్నారు. ప్రధానమంత్రి పదవి మన మాటురామ్ జాలేబి కాదా అని అడగండి? వాస్తవానికి, మాతురామ్ జిలేబీ దుకాణం 1958లో ప్రారంభించింది. ఒక జిలేబీ బరువు 250 గ్రాములు,ఒక పెట్టెలో ఒక కిలో జిలేబీ ఉంటుంది అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories