Assembly Election Results: నేడు హర్యానా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల రిజల్ట్స్..కొద్దిసేపట్లో తొలిరౌండ్ ఫలితం

Haryana and Jammu Kashmir election results today
x

Assembly Election Results: నేడు హర్యానా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల రిజల్ట్స్..కొద్దిసేపట్లో తొలిరౌండ్ ఫలితం

Highlights

Assembly Election Results: హర్యానా - జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రౌండ్ ఫలితం 9గంటలకు రానుంది.

హర్యానా - జమ్మూ కాశ్మీర్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుంది. రెండు రాష్ట్రాల్లో 90-90 స్థానాలకు పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఓటింగ్ జరిగింది. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకోగలదని విశ్వాసంతో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

హర్యానాలో 90నియోవర్గలకు గాను 1,031 మంది అభ్యర్థులు పోటీ చేస్తే అందులో 464మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. 101 మంది మహిళలు ఉన్నారు. ఈనెల 5వ తేదీన ఇక్కడ పోలింగ్ జరిగింది. అటు కాశ్మీర్ లో 90స్థానాలకు సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 1న మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 63,45శాతం పోలింగ్ జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories