కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా
x
Highlights

ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న అకాలీదళ్‌ కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం..

ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న అకాలీదళ్‌ కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. మంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆమె మంత్రి పదవిని వదులుకోవాలని అకాలీదళ్‌ నిర్ణయించింది. అంతేకాదు పార్లమెంటులో ప్రభుత్వం తెచ్చే రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆ పార్టీ‌ స్పష్టం చేసింది.

అయితే కేవలం వ్యవసాయ బిల్లులను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన అకాలీదళ్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మాత్రం మద్దతు ఉంటుందని తెలిపింది.కాగా పార్టీ విధానానికి మద్దతుగా ఉండేందుకు.. హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి పదవికి రాజీనామా సమర్పించారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ఆమె‌ రాజీనామా చేయడం కీలక పరిణామక్రమంగా మారితే.. లోక్‌సభలోనే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంచలనం సృష్టించారు.. కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట ప్రజలలోకి తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇక ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణాకు చెందిన కొందరు రైతులు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన బిల్లులు ఇలా ఉన్నాయి.. రైతులు తమ ఉత్పత్తులను స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులలోనే విక్రయించాలన్న నిబంధనను తొలగించేందుకు వీలుగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, అలాగే రైతులు తమ పంట వేయడానికి ముందుగానే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వ్యాపారులతో ఒప్పందాలకు రక్షణ కల్పించే ఫార్మర్స్ అగ్రిమెంట్ అన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories