నేడే బాలల దినోత్సవం ...

నేడే బాలల దినోత్సవం ...
x
Highlights

బాల్యం అనేది మనందరం అనుభవించే ఈ స్థాయికి చేరుకుంటాం. ఈ బాల్యం అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక వరం. చిన్న పిల్లల మనసు పువ్వుల లాంటివి. అలాంటి బాలల...

బాల్యం అనేది మనందరం అనుభవించే ఈ స్థాయికి చేరుకుంటాం. ఈ బాల్యం అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక వరం. చిన్న పిల్లల మనసు పువ్వుల లాంటివి. అలాంటి బాలల కోసం ఒక రోజును దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. అదే బాలల దినోత్సవం. జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజును అంటే నవంబరు 14 ఈ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నెహ్రూ పుట్టిన రోజునే ఎందుకు బాలల దినోత్సంలా జరుపుకుంటారనే విషయానికొస్తే నెహ్రూకి గులాబీ పువ్వులన్న, అలాగే చిన్న పిల్లలన్న చాలా ఇష్టం. తన దగ్గరి కొచ్చిన పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని పిలిచేవారు.

చాచా నెహ్రూ గురించి..

భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం చేసుకున్నారు. బ్రిటీష్ దొరలు భారత దేశాన్ని పాలించే సమయంలో గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆ సయంలో ఆయన ప్రథమ శిష్యుడిగా నెహ్రూ ఉన్నారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఆయన పనిజేశారు.

ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం

నెహ్రూకి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్ట పడేవారు. కానీ ఆయన దేశానికి స్వాతంత్రం తేవడానికి పోరాటాలు చేసేవారు. దీంతో ఆయన ఎక్కువ కాలం జైళ్ళలోనే గడపాల్సి వచ్చేది. దీంతో ఆయన ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోయారు. తన కూతురి స్థానంలో దేశంలోని పిల్లలందరినీ కన్నబిడ్డలుగా చూసే వారు. ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసేవారు. చిన్న పిల్లలతో కాలం గడుపుతున్నప్పుడు వారి మనసు ఎంతో హాయిగా ఉంటుందని వారు తెలిపేవారు. దీంతో ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో భారత దేశంలో ఉన్న బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తనకు చిన్న పిల్లల మీద ఉన్న ప్రేమే నవంబర్ 14ను బాలల దినోత్సంగా జరుపుకునేలా చేసింది. ఈ రోజున దేశవాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు, పిల్లలకు పాఠశాలల్లో బహుతులను పంచుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories