Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు వివాదంపై నేడు కీలక తీర్పు

Gyanvapi Masjid Case Judgment For Today
x

Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు వివాదంపై నేడు కీలక తీర్పు

Highlights

Gyanvapi Masjid Case: ఇప్పటికే పూర్తయిన వాదనలు, వారణాసిలో 144 సెక్షన్, కట్టుదిట్టమైన భద్రతా

Gyanvapi Masjid Case: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ కీలక తీర్పును ఇవ్వనున్నది. మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వారణాసిలో హైఅలర్ట్‌ ప్రకటించారు. కాశీ విశ్వనాథ్‌ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్‌ అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి.. ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే.. ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు.

మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది. ఒకవేళ తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తామని పిటిషనర్లు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories