గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు

Gussadi Dance Performer Kanakaraju Received Fourth Highest Padma Shri Award Presented by Ram Nath Kovind
x

గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు(ఫైల్ ఫోటో)

Highlights

* రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం * ఆదివాసీ సంప్రదాయమైన గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు

Kanaka Raju - Padma Shri: నమ్ముకున్న కళ తన తలరాతను మార్చింది. ఎంతంటే ఏకంగా దేశ స్థాయిలో మెరిసేలా. కొద్దినెలల క్రితం వరకూ అనామకుడిలా ఉన్న ఆయన పేరు, ఇప్పుడు దేశం మొత్తం మారుమ్రోగుతుంది. ఆయనే కనక రాజు అత్యున్నత స్థాయిలో ఆయనకు పేరు తెచ్చిన కళ గుస్సాడీ.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు దేశ అత్యున్నత నాలుగో పురస్కారం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రాణమిచ్చే కనకరాజు మార్లవాయిలో 1938లో జన్మించారు. కనకరాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పార్వతి, రెండో భార్య పేరు భీంబాయి. ఈ దంపతులకు 12 మంది సంతానం. వీరిలో 8 మంది ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు.

కుమారులంతా వ్యవసాయ పనులు చేస్తుంటారు. కనకరాజుకు గుస్సాడీ నృత్యాలు అంటే ఎంతో ఇష్టం. గుస్సాడీ నృత్యాన్ని నేర్చుకోవడంతో పాటు తన తర్వాత సైతం చాలా మందికి నేర్పించాడు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదుట ఢిల్లీలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చే అవకావం కలిగింది.

ఎర్రకోట వద్ద సైతం గుస్సాడీ నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందిరా గాంధీ చేతులమీదుగా ప్రశంసాపత్రాలతో పాటు బహుమతి కూడా అందుకున్నారు. ఇందిరా గాంధీకి తన గుస్సాడీ టోపీని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఏటా ఎంతోమంది యువకులకు గుస్సాడీ శిక్షణ ఇచ్చేవారు.

దీంతో ఆయన ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. మార్లవాయితో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే కనకరాజు గుస్సాడీ నృత్యం ఉండాలి. అలాగే నేడు మార్లవాయి పేరును చరిత్ర పుటల్లో లిఖించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories