కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 8మంది ఎమ్మెల్యేల రాజీనామా..

కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 8మంది ఎమ్మెల్యేల రాజీనామా..
x
Highlights

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మొత్తం ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరి గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తమ రాజీనామాలను అందజేశారు. వారి రాజీనామాలు కూడా ఆమోదించినట్లు స్పీకర్ త్రివేది గురువారం విలేకరులకు చెప్పారు.

తాజాగా మరొకరు రాజీనామా చేయడంతో ఆ పార్టీ సంక్షోభంలో పడినట్లయింది. కాగా దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఇద్దరి చేత నామినేషన్లు వేయించింది. అయితే ఎమ్మెల్యేలు మొత్తం ఎనిమిది మంది రాజీనామా చేయడంతో ఆ పార్టీకి రెండో రాజ్యసభ సీటు కష్టతరంగా మారింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories