ఇవాళ జీఎస్టీ 46వ కౌన్సిల్ సమావేశం.. పన్ను రేట్ల సవరణ, మినహాయింపుపై చర్చ

GST Council Meeting Today Under Finance Minister Nirmala Sitharaman | National News
x

ఇవాళ జీఎస్టీ 46వ కౌన్సిల్ సమావేశం.. పన్ను రేట్ల సవరణ, మినహాయింపుపై చర్చ

Highlights

GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశం

GST Council Meeting: జీఎస్టీ మండలి 46వ సమావేశం ఇవాళ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. విలోమ పన్ను విధానం కూడా చర్చకు రానుంది.

ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున పన్నురేట్లు అమల్లో ఉన్నాయి. అయితే 12, 18 శాతం పన్ను శ్లాబులను కలపాలన్న డిమాండ్లు ఉన్నాయి. మరోవైపు చేనేతపై 5శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి పెంచాలన్న నిర్ణయంపైనా పలు రాష్ట్రాలు, పరిశ్రమల వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ మండలి భేటీ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories