రైతుల ఉద్యమంపై గ్రెటా థన్‌బర్గ్‌ వరుస ట్విట్స్.. నెటిజన్లు ఫైర్

రైతుల ఉద్యమంపై  గ్రెటా థన్‌బర్గ్‌ వరుస ట్విట్స్.. నెటిజన్లు ఫైర్
x

 Greta Thunberg

Highlights

*వరుసగా రెండోరోజు రైతులకు సంఘీభావంగా గ్రెటా ట్వీట్ *ఇప్పటికీ రైతుల పక్షానే ఉన్నానన్న గ్రెటా థన్‌బర్గ్ *గ్రెటా థన్‌బర్గ్‌పై విరుచుకుపడ్డ భారత నెటిజెన్లు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల పోరాటం సామాజిక యుద్ధానిక తెరలేపిందా..? ఇంటా బయటా వస్తున్న విమర్శలతో కేంద్రం ఎదురు దాడి ప్రారంభించిందా.. అంటే అవుననే చెప్పాలి. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో మొదలైన సోషల్ మీడియా వార్.. గ్రెటా థన్‌బర్గ రంగంలోకి దిగడంతో మరింత ముదిరింది. అటు.. ప్రభుత్వ వార్నింగ్‌తో బ్లాక్ చేసిన ట్వీట్లను మళ్లీ అన్‌బ్లాక్ చేయడంతో ట్విట్టర్‌పై మరోసారి కేంద్రం సీరియస్ అయింది. మీరు మధ్యవర్తులు మాత్రమే.. న్యాయస్థానంలా వ్యవహరించారో చర్యలు తప్పవంటూ మరో హెచ్చరించింది.

రైతుల ఉద్యమంలో ఒత్తిడి పెరుగుతున్న వేళ కేంద్రం ఎదురుదాడి ప్రారంభించింది. విదేశాంగ శాఖ సహా ఏడుగురు కేంద్ర మంత్రులు విదేశీ సెలబ్రీటీలపై ఎదురు దాడి చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఓ రకంగా మున్నెన్నడూ లేని విధంగా వేలకొద్దీ అనుకూల, ప్రతికూల పోస్టులతో ట్విటర్‌ హోరెత్తిపోతోంది. అటు మంత్రులకు మద్ధుతుగా ఇండియన్ సెలబ్రిటీలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరోవైపు.. పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. థన్ బర్గ్ తన వ్యాఖ్యల ద్వారా నేరపూరితమైన కుట్రకు తెరదీశారని, ఆమె వ్యాఖ్యలు ప్రజా సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, తనపై కేసు నమోదైన నేపథ్యలో థన్ బర్గ్ స్పందిస్తూ, తాను ఇప్పటికీ రైతుల పక్షమేనని స్పష్టం చేసింది. ఎలాంటి బెదిరింపులు తన వైఖరిని మార్చలేవని స్పష్టం చేసింది. రైతుల శాంతియుత ధర్నాలకు తానిప్పటికీ మద్దతు ప్రకటిస్తున్నానని ట్వీట్ చేసింది.

మరోవైపు.. పలు ట్వీట్లు, లింకులను ట్విట్టర్ అన్‌బ్లాక్ చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. తమ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని నోటీసులు జారీ చేసింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌‌‌‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. 257 లింకులను, 1 హ్యాష్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌ను వెంటనే బ్లాక్‌‌‌‌ చేయాలని ట్విట్టర్‌‌‌‌ను ఆదేశించింది. దీంతో 250 అకౌంట్లను ట్విట్టర్‌‌‌‌ సోమవారం నిలిపేసింది. 150 ట్వీట్లను తొలగించింది. కానీ కొన్ని గంటలకే మళ్లీ వాటిని అన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ చేసింది. దీంతో కేంద్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సంస్థ తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories