Eggs With Green Yolk: ఆశ్చ‌ర్యం..ఆకుప‌చ్చ కోడిగుడ్లు.. ఎక్క‌డో కాదు

Green Yolk Eggs Spotted in Kerala Hens Form
x

Eggs With Green Yolk

Highlights

Eggs With Green Yolk: సాధారణంగా కోడి గుడ్డు లోప‌ల ప‌సుపు రంగుంలో ఉంటుంది. గుడ్డులో ఉండే దానిని మ‌నం తెల్లసొన, పసుపు పచ్చసొన అంటాము

Eggs With Green Yolk: మ‌న ఆహారంలో కోడి గుడ్డు కూడా ఓ భాగ‌మైపోయింది. కోడి గుడ్డులో మంచి పోషక పదార్థాలు ప్రొటీనులు, కొలైన్లు కలిగివుండడంతో వైద్యులు కూడా కోడిగుడ్లను తినాలని చెబుతారు. ఇక ఈ కరోనా కాలంలో వీటి వినియోగమూ మరింత పెరిగింది. అంద‌రూ కోడి గుడ్డుని త‌మ రోజు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కోడి గుడ్డు తిననివారి విషయం పక్కన పెడదాం.

అయితే సాధారణంగా కోడి గుడ్డు లోప‌ల ప‌సుపు రంగుంలో ఉంటుంది. గుడ్డులో ఉండే దానిని మ‌నం తెల్లసొన, పసుపు పచ్చసొన అంటాము. అయితే ఆకుపచ్చసొనతో కూడా ఉంటాయ‌ని మీకు తెలుసా? ఏంటి ఆకుప‌చ్చ రంగులోనా..గుడ్డు మురిగిపోయి ఉంటుంది అనుకుంటున్నారా? విదేశాల్లో అయి ఉంటుందిలే అనుకుంటున్నారా? అస్స‌లు కాదు.. మ‌న దేశంలోనే.. ఆశ్చ‌ర్యంగా ఉందా? న‌మ్మ‌లేక‌పోతున్నారా? నిజమండీ బాబు... గ్రీన్ క‌ల‌ర్ ఎగ్ గురించి తెలుసుకుందాం?

కేరళలోని ఒతుక్కుంగల్‌లో ఓ ఫాంలో ఈ ఆకుపచ్చసొనతో ఉన్న కోడిగుడ్లను ఉన్న6 కోళ్లు మాత్రమే పెడుతున్నాయి. షిహాబుద్దీన్‌ అనే వ్య‌క్తికి కోళ్ల ఫాల్ట్రీ ఉంది. అందులో ఆయ‌న నాటు కోళ్లను పెంచుతుంటారు. అయితే వాటిలో ఆరు కోళ్లు పెట్టిన గుడ్లలో లోపలి సొన మాత్రం ఆకుపచ్చగా ఉంటోంది. షిహాబుద్దీన్‌ కుటుంబం వాళ్లు మొదటగా ఆ గుడ్లు పాడైపోయాయనుకున్నారు. అకుప‌చ్చ సొన గుడ్లు తింటే ప్రమాదం వాటిల్లుతుందేమో అని భయపడ్డారు. కానీ తర్వాత వాటిని పొదిగిస్తే చక్కగా.. ఆరోగ్యవంతమైన కోడిపిల్లలు బయటకు వచ్చాయి. దీంతో అప్ప‌టి నుంచి షిహాబుద్దీన్ కుటుంబం ఆ గుడ్ల‌ను తింటున్నారు. గ్రీన్ క‌ల‌ర్ ఎగ్స్ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. మొద‌ట నెటిజ‌న్లు ఇది న‌మ్మ‌లేదు.

షిహాబుద్దీన్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ కావ‌డంలో కేరళ వెటర్నరీ, ఎనిమల్‌ సైన్సెన్‌ యూనివర్సిటీ' చెందిన వైద్యుడి కంట ప‌డింది. ఆయ‌న వెళ్లి ఆ ఆరు కోళ్ల‌ను ప‌రీశీలించారు. కొన్ని పరిశోధనలు చేశారు. చివరికి కోళ్లు తీసుకునే ఆహారం వల్ల ఇలా జరిగి ఉంటుందని తేల్చారు. షిహాబుద్దీన్ కూడా అదే అభిప్రాయ‌న్ని వ్య‌క్తం చేశాడు. షిహాబుద్దీన్ ఫాంలో కోళ్ల‌కు పెరట్లో పెరిగే మూలికల మొక్కల ఆకులను వాటి దాణాలో కలిపి ఇచ్చానని చెబుతున్నాడు. అందుకే కోడి గుడ్లు రంగు మారి ఉంటాయి అన్నాడు. వాటి ఆహారం మార్చి చూస్తే.. సాధార‌ణం గుడ్లు పెట్టాయ‌ని అంటున్నాడు. అయితే ఈ విష‌యం తెలిసిన అక్క‌డి వారంతా షిహాబుద్దీన్ కోడ్ల‌ను అమ్మాల‌ని ఓత్తిడి తెస్తున్నారు. కోడికి ల‌క్ష‌రూపాయ‌లు ఆఫ‌ర్ కూడా చేశారు. అయితే షిహాబుద్దీన్ కోళ్ల‌ను అమ్మేందుకు ఇష్టప‌డ‌డం లేదు. ఇదండీ అస‌లు క‌థ‌.. ఆకుప‌చ్చ కోడిగుడ్లు, కేరళ కోడి గుడ్లు క‌థ‌.

Show Full Article
Print Article
Next Story
More Stories