Guidelines for Gyms, Yoga Institutes: యోగా,జిమ్‌ సెంటర్ల ఓపెన్‌..మార్గదర్శకాల విడుద‌ల‌

Guidelines for Gyms, Yoga Institutes: యోగా,జిమ్‌ సెంటర్ల ఓపెన్‌..మార్గదర్శకాల విడుద‌ల‌
x
Highlights

Guidelines for Gyms, Yoga Institutes: క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌భావం దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థపై పడటంతో కేంద్రం వ‌రుస‌గా స‌డ‌లింపులు ప్ర‌క‌టిస్తు వ‌చ్చింది.

Guidelines for Gyms, Yoga Institutes: క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌భావం దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థపై పడటంతో కేంద్రం వ‌రుస‌గా స‌డ‌లింపులు ప్ర‌క‌టిస్తు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి యోగా, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం తాజాగా విడుద‌ల చేసింది.

మార్గదర్శకాలు

* కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న యోగా , జిమ్ సెంట‌ర్ల‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని కేంద్రం ఆదేశించింది.

* 65 ఏండ్ల‌కు పైబ‌డిన వారు, గర్భిణులు, ప‌దేళ్ల లోపు పిల్ల‌ల‌ను సంవత్సరాల లోపు పిల్లలు జిమ్‌, యోగా కేంద్రాల్లోకి అనుమతించకూడదు.

* ప్రతి ఒక్కరు ఆరు అడుగుల దూరం కచ్చితంగా పాటించాలి.

* ఫేస్‌ గార్డ్స్‌/మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. అలాగే యోగా, చేసేటప్పుడు వైజర్‌(తేలికపాటి) వాడాలి. n-95 మాస్క్‌లను వాడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తొచ్చు.

* తరచుగా చేతులు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం మంచిది.

* దగ్గు, జలుబు వంటి వచ్చినప్పడు టిష్యూ, చేతి రుమాలుతో, మోచేతిని అడ్డుగా పెట్టుకోవాలి,

* ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే రాష్ట్ర లేదా జిల్లా హెల్ప్‌లైన్‌ని సంప్రదించడం మంచిది.

*ఆరోగ్య సేతు యాప్‌ ప్రతి ఒక్కరు ఉపయోగించడం ఉత్తమం.

* పరిసర ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం.

* స్పా, స్టీమ్‌ బాత్‌, స్విమ్మింగ్ పూల్ వంటివి మూసి ఉంచాలని ఆదేశించారు.

* ఎయిర్‌కండిషన్డ్‌ ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంచడంతో మేలని పేర్కొన్న‌ది.

Show Full Article
Print Article
Next Story
More Stories