RBI Deputy Governor: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రబి శంకర్‌

Govt Appointed T Rabi Shankar as RBI Deputy Governor
x

రబి శంకర్ రబీ న్యూ గవర్నర్

Highlights

RBI Deputy Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్మూటీ గవర్నర్‌గా టి. రబీ శంకర్‌ నియమితులయ్యారు.

RBI Deputy Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్మూటీ గవర్నర్‌గా టి. రబీ శంకర్‌ నియమించబడ్డారు. ఈ నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజు ఆ కమిటి అనుమతి ఇచ్చింది. మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవీలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రబి శంకర్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. గత నెల 2వ తేదీన బీపీ కనుగో రిటైర్డ్‌ అయిన తర్వాత ఈ డిప్యూటీ గవర్నర్‌ పోస్టు ఖాళీగా ఉంది. అయితే శంకర్‌ కాకుండా ఇప్పటికే మహేష్‌ కుమార్‌ జైన్‌, మైకేల్‌ పాత్రా, రాజేశ్వర్‌ రావు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లుగా ఉన్నారు.

పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరీ ఆపరేషన్లలో శంకర్‌కు మంచి పట్టుంది. కాగా, శంకర్‌ బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌ నుంచి డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌లో డిప్లొమా కూడా ఉంది. 2020లో శంకర్‌ను ఇండియన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ అండ్‌ అలైడ్‌ సర్వీసెస్‌ (ఇఫ్టాస్‌) చైర్మన్‌గా నియామకం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories