Ration Shops: త్వ‌ర‌లో రేష‌న్ షాపులో చిన్న సిలిండ‌ర్ల విక్ర‌యాలు..!

Government Seeks to Sell Small gas Cylinders at Ration Shop Soon
x

రేషన్ షాపుల్లో చిన్న గ్యాస్ సిలిండర్ విక్రయాలు (ఫొటో ది హన్స్ ఇండియా)

Highlights

Ration Shops: రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్‌పీజీ సిలిండర్లను విక్రయించే అంశాన్ని వెల్లడించింది.

Ration Shops: రేషన్ షాపుల ద్వారా చిన్న ఎల్‌పీజీ సిలిండర్లను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. PTI ప్రకారం.. ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కాకుండా CSC ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ (CSC) తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంత‌రం ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఎఫ్‌పిఎస్ ఆర్థిక సాధ్యతను పెంపొందించడానికి బలమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. FPS ద్వారా చిన్న LPG సిలిండర్ల రిటైల్ విక్రయాల ప్రణాళిక పరిశీలనలో ఉంద‌ని ప్ర‌క‌టించింది.

చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు రేషన్ దుకాణాల ద్వారా చిన్న LPG సిలిండర్ల విక్రయాల ప్రతిపాదనను ప్రోత్సహించారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాల‌కు సహకారం అందిస్తామని తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్‌ల (సిఎస్‌సి) సహకారంతో ఎఫ్‌పిఎస్ ప్రాముఖ్యత పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా సాధ్యాసాధ్యాలను సమీక్షించేందుకు సీఎస్‌సీతో సమన్వయం చేసుకుంటానని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ముద్రా రుణాన్ని ఎఫ్‌పిఎస్ డీలర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వారు మూలధనాన్ని పెంచుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను చేపట్టి అవసరాలకు అనుగుణంగా ప‌నిచేయాల‌ని ఆహార కార్యదర్శి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories